బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షుల మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ

బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షుల మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడి మార్పుతో అనుబంధ సంఘాల మార్పు కూడా ఉంటుందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే.. ఇవన్నీ నిజం కావని తేలిపోయింది. బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమావేశమయ్యారు. అనుబంధ కమిటీల మార్పు ఉండదని ఈ సమావేశంలోనే కిషన్ రెడ్డి సంకేతాలిచ్చారు. దీంతో బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

100 రోజుల ప్రణాళికపై వర్క్ ఔట్ చేయాలని బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విడివిడిగా మోర్చాల ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టుకుని ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

ప్రస్తుతం ఉన్న బీజేపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు వీళ్లే..

* బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా భానుప్రకాశ్

* బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా కొప్పు బాషా

* బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా గీతామూర్తి 

* బీజేపీ బీసీ మోర్చా అధ్యక్షులుగా అలే భాస్కర్

* బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షులుగా హుసేన్ నాయక్

* బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా అప్సర్ పాషా 

* బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులుగా శ్రీధర్ రెడ్డి