సైకిల్ తొక్కిన మంత్రి కిషన్ రెడ్డి

సైకిల్ తొక్కిన మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ బైసైకిలింగ్ క్లబ్, చరక్ స్కూల్ ఆధ్వర్యంలో వరల్డ్ బైసైకిల్ డే ఈవెంట్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో  పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరముందన్నాయన.  GHMC జోనల్ కమిషనర్ హరి చందన,  మాజీ MLA చింతలతో కలిసి సైకిల్  రైడ్ చేశారు కిషన్ రెడ్డి.

దేశంలో వాతావరణ కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో విధానాలు రూపొందించామన్నారు.