పార్టీనే నా ఊపిరి, ప్రాణం.. ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తా : కిషన్ రెడ్డి

పార్టీనే నా ఊపిరి, ప్రాణం..  ఏ బాధ్యత ఇచ్చినా పని చేస్తా : కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఎంపికయి తర్వాత.. మొదటి సారి మీడియాతో మాట్లాడారు కిషన్ రెడ్డి. పార్టీ ప్రకటన తర్వాత బయటకు వచ్చిన ఆయన.. మీడియాలో వస్తున్న వార్తలపైనా స్పందించారు. ఎలాంటి అలక లేదని.. ఆనందంగానే ఉన్నానని వివరించారాయన. నాలుగో సారి పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక అయినట్లు చెబుతూనే.. ఉమ్మడి ఏపీలో రెండు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అధ్యక్షుడిగా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. 

పార్టీ సిద్దాంతం కోసం పని చేసే వ్యక్తినని.. పార్టీకి మించింది ఏదీ లేదని తన వైఖరిని స్పష్టం చేశారాయన. ఇప్పటి వరకు పార్టీని ఏదీ అడగలేదని.. అన్నీ పార్టీనే ఇచ్చిందని.. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించటానికి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. కేంద్ర మంత్రి పదవి కూడా ప్రధాని మోదీ పిలిచి ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి.  

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని.. జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో కలిసి పని చేస్తానని వివరించారాయన. ప్రధాని మోదీ 8వ తేదీ వరంగల్ వస్తున్నారని.. రెండు రోజులు అక్కడే ఉంది ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు వెల్లడించారాయన.  8వ తేదీ ప్రధాని మోదీ వస్తున్నారు. 150 ఎకరాల్లో.. వరంగల్ ను రైల్వే కోచ్ ల మ్యానిఫ్యాక్టరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు 6 వేల కోట్ల విలువైనటువంటి నూతన జాతీయ రహదారులకు భూమి పూజ చేయనున్నారు. ఈ రెండు పెద్ద కార్యక్రమాలు.. తెలంగాణకు వస్తున్నాయి. 

భద్రకాళి ఆలయంలో పూజల కోసం రిక్వెస్ట్ చేశాం.. సమయాన్ని బట్టి అమ్మవారి దర్శనం ఉండొచ్చు..
యూనిరవ్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని బహిరంగ సభలో పాల్గొంటారు
వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారు
9వ తేదీన సౌత్ ఇండియా రాష్ట్రాల ముఖ్య నేతల సమావేశం.. హైదరాబాద్.. కర్ణాటక, కేరళ, పుధిచ్చేరి, ఏపీ, లక్షదీప్, రాష్ట్రాల సమావేశం.. ఉంటుంది..