100 జిల్లాల్లో ప్రధానమంత్రి జన్మన్ పథకం: కిషన్ రెడ్డి

100 జిల్లాల్లో ప్రధానమంత్రి జన్మన్ పథకం: కిషన్ రెడ్డి

దేశంలో గిరిజనులు ఇంకా అన్యాయానికి గురువుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మౌళిక సదుపాయాలు లేవన్నారు. జనవరి 14వ తేదీ ఆదివారం కిషన్ రెడ్డి నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జనవరి 15వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన్మన్ పథకం అమలు చేయబోతున్నట్లు చెప్పారు.

 దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తామాన్నారు. 100 జిల్లాల్లో ఇప్పటికే లక్ష ఇండ్లు ఇచ్చామని.. రేపు పట్టాలు కూడా అందజేస్తామని తెలిపారు. తండాల్లో వెయ్యికిలోమీటర్ల రోడ్లు వేస్తున్నామన్నారు. 27వేల ట్రైబల్స్ ఇండ్లకు నల్లా నీళ్లు రేపు ప్రారంభిస్తామని... త్వరలో 100 హాస్టళ్లను నిర్మించబోతున్నామని చెప్పారు.  ట్రైబల్స్ కోసం మల్టీ పర్పస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. 17 గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ కరెంట్ లేదని... రేపు ఆ గ్రామాలకు కరెంట్ ఇవ్వబోతున్నామని... 72వేల మందికి కొత్తగా ఆధార్ కార్డులు ఇవ్వబోతున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.