రాష్ట్రంలో ‘ఆయుష్మాన్‘ అమలేది?:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో ‘ఆయుష్మాన్‘ అమలేది?:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఢిల్లీ : ఆయుష్మాన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదన్నారు  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.కేంద్రమంత్రిగా బాధ్యతలు అప్పగించిన  ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పిన కిషన్ రెడ్డి.. గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రానికి చాలా నిధులు కేటాయించిందన్నారు. కేంద్ర పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా మార్చుకుందని విమర్శించారు.  రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుంది. గత నాలుగు సంవత్సరాలుగా రేషన్ కార్డులు ప్రింటింగ్ కూడా చేయడం లేదన్నారు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వ లోగో ఉండటమే కారణమన్నారు.

హైదరాబాద్ లో శాంతిభద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అయినా కూడా కేంద్ర సహాయ సహకారాలు ఉంటాయన్నారు. దేశంలో అక్రమ వలసల వల్ల జనాభా పెరుగుతోందని.. దానిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కిషన్ రెడ్డి.