
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అధ్యక్షుడి మార్పుపై అధిష్టానం అలోచనే లేదన్నారు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇలా ఎందుకు సృష్టిస్తున్నారో తెలియదని చెప్పారు. దీనిపై కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని తెలిపారు. ఇక అమిత్ షాతో సమావేశం రెగ్యూలరేనని వెల్లడించారు.
మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఖండించారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ యధావిధిగా కంటిన్యూ అవుతారని స్పష్టం చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.