త్వరలో బీఆర్ఎస్ ఆఫీస్​కు తాళం : కిషన్ రెడ్డి

త్వరలో బీఆర్ఎస్ ఆఫీస్​కు తాళం : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​కు తాళం పడనుందని కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలోని బీఆర్ఎస్ ఆఫీస్​ ఇప్పటికే మూత పడిందని, అదే పరిస్థితి తెలంగాణలోనూ రాబోతున్నదని జోస్యం చెప్పారు. అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ నాయకత్వా న్ని బలపరచాలని పిలుపునిచ్చారు. 

గ్రామస్థాయిలో 25 మంది చొప్పున యువకులు, మహిళలు, రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి చేరికలు చేపడుతామన్నారు. గురువారం ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కార్ పదేండ్ల పాలనలో రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చిందన్నారు. పార్టీ హైకమాండ్ ప్రకటించబోయే లోక్ సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నామని, మెజార్టీ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు.  ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా తర్వాత అతిపెద్ద రైల్వే వ్యవస్థగా భారత్ ఉందని, త్వరలోనే  మూడో స్థానానికి చేరుకోనున్నదని కిషన్ రెడ్డి చెప్పారు.