కేసీఆర్ను మళ్ళీ గెలిపిస్తే రాష్ట్రాన్నిఅమ్మేస్తడు: కిషన్ రెడ్డి

కేసీఆర్ను మళ్ళీ గెలిపిస్తే రాష్ట్రాన్నిఅమ్మేస్తడు: కిషన్ రెడ్డి

దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ బీఆర్ఎస్ అని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు.  కేసీఆర్ ని మళ్ళీ గెలిపిస్తేరాష్ట్రం మొత్తాన్ని అమ్మేస్తారంటూ ధ్వజమెత్తారు.  కేసీఆర్ ను గద్దె దించి బుద్ది  చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.  1200ల మంది ఆత్మబలిదానాలు చేసుకుని తెలంగాణని సాధిస్తే... తన వళ్లే తెలంగాణ వచ్చిందంటూ గొప్పలు చెబుతుండన్నారు. 

ఎన్నికల ముందు కేసీఆర్ మరోసారి  రైతుల రుణమాఫీ అంటూ మభ్యపెడ్తున్నాడని మండిపడ్డారు.  దళితబందు గులాబీ నాయకులకే ఇస్తున్నారని.. అందులో కూడా 30 శాతం కమీషన్ లు తీసుకుంటున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు దొంగనాటకాలు ఆడారన్నారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్... నిరుద్యోగాన్ని పెంచుతున్నారని మండిపడ్డారు.  కల్వకుంట్ల కుటుంబం చేసే మోసాల్ని ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.