ప్రపంచంలో అలాంటి సీఎం.. కేసీఆర్ ఒక్కరే

ప్రపంచంలో అలాంటి సీఎం.. కేసీఆర్ ఒక్కరే

ఏడేళ్లలో రాష్ట్రానికి సీఎం కేసీఆర్ ఏం చేయలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచంలో సెక్రటేరియట్ కు రాని సీఎం.. కేసీఆర్ ఒక్కరే అన్నారు.  ఫిర్జాదిగూడ లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ ఏడేళ్లలో ఒక్క టీచర్  ఉద్యోగం ఇవ్వలేదని.. ఒక్క హాస్పిటల్  కట్టలేదని మండిపడ్డారు. కేంద్రం RRR ప్రాజెక్టు కోసం 17వేల కోట్లు ఇస్తోందన్నారు కిషన్ రెడ్డి.  RRR ప్రాజెక్టుతో  పెద్దఎత్తున కంపెనీలు వస్తాయని.. వేలమందికి జాబ్ దొరుకుతుందని చెప్పారు. కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో జనాలకి చెప్పాలన్నారు రాంచంద్రరావు.