ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సీట్లు తక్కువొస్తాయి : కిషన్ రెడ్డి

ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు సీట్లు తక్కువొస్తాయి : కిషన్ రెడ్డి

దేశద్రోహులకు కూకట్పల్లి బీజేపీ అంటే వణుకు అన్నారు కిషన్ రెడ్డి. కూకట్పల్లి బీజేపీకి ఒక చరిత్ర ఉందని చెప్పారు. నరేంద్రమోదీ దేశానికి ప్రధానమంత్రి మాత్రమే కాదని, ప్రపంచానికి నాయకుడిగా ఎదిగారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్10 ఏళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల దోపిడీ చేసిందని ఆరోపించారు. అందుకే బీజేపీని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పారు. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ దోపిడీదారులను తరిమికొట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి అవుతానంటూ సీఎం కేసీఆర్ పగటికలలు కంటున్నారని మండిపడ్డారు. గతంలో వచ్చిన సీట్లు కూడా ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రావన్నారు. తెలంగాణలోని సంపదను అందినకాడికి కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని చెప్పారు. భూములను ఎక్కడికక్కడ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బీజేపీలో చేరారు. కూకట్ పల్లి మెట్రో హుడా ట్రక్ పార్కింగ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కిషన్ రెడ్డి సమక్షంలో ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ బీజేపీలో చేరారు.