V6 News

కొట్టినట్టు చెయ్యి.. ఏడ్చినట్టు చేస్తా.కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కొట్టినట్టు చెయ్యి.. ఏడ్చినట్టు చేస్తా.కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •     కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ

ముషీరాబాద్, వెలుగు: కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై నువ్వు కొట్టినట్టు చెయ్.. నేను ఏడ్చినట్టు గా చేస్తా.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, కేసీఆర్ మాట్లాడుకొని తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గురువారం రాంనగర్ లోని మేడి బాయ్ బస్తీలో అంగన్వాడీ కేంద్రాన్ని, బస్తీ దవాఖానను ఆయన సందర్శించారు. 

అనంతరం నల్లకుంట లోని ఫీవర్ హాస్పిటల్లో ఈసీజీ వైద్య పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక చెల్లదని అది పూర్తిగా చట్ట విరుద్ధమన్నారు. నార్మ్స్ ప్రకారం ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేయలేదని చెప్పిన హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు.