
వరంగల్ లో పెట్టేది టీఆర్ఎస్ విజయగర్జన సభ కాదు.. కల్వకుంట్ల సభ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో ప్రజాపాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు కిషన్ రెడ్డి. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఈటల రాజేందర్ విజయోత్సవ సభకు నేతలు హాజరయ్యారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ కార్యకర్తలు రెడీగా ఉండాలన్నారు నేతలు.
మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం
తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి.. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఈటల రాజేందర్ విజయోత్సవ సభకు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ కార్యకర్తలు రెడీగా ఉండాలన్నారు. హుజురాబాద్ లో 500 కోట్లను కేసీఆర్ ఖర్చు పెట్టారన్నారు. అయినా ఈటల గెలుపును అడ్డుకోలేదన్నారు వివేక్ వెంకటస్వామి..