కరోనా మళ్లీ విజృంభిస్తోంది.. మాస్క్ పెట్టుకోండి

కరోనా మళ్లీ విజృంభిస్తోంది.. మాస్క్ పెట్టుకోండి

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో 3 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా కేంద్రం గుర్తించిందన్నారు. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలను ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించామన్నారు.  ఈ జిల్లాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. ఆస్పిరేషన్ జిల్లాల్లో అభివృద్ధి పనులను కేంద్రం స్వయంగా పరిశీలిస్తుందన్నారు. ప్రపంచంలో కరోనా వారియర్స్ ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. త్వరలో 5 నుంచి 15 ఏళ్ల పిల్లలకు వాక్సిన్ అందిస్తామన్నారు. కరోనా మళ్లీ విజృంభిస్తోందని.. అందరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. కరోనా ఫోర్త్ వేవ్  ప్రభావం లేకుండా కలిసికట్టుగా పోరాడుదామన్నారు.