
బీజేపీ స్టేట్ చీఫ్ గా ప్రస్తుత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రెడ్డిబాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ముందుగా నిర్ణయించిన శుభ ముహూర్తంలో 2023 జూలై 21న ఉదయం 11.45 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, బిజేపీ నేతలు మురళీధర్ రావు, ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపి అరవింద్,మాజీ ఎంపీ విజయశాంతి తదితరులు హాజరయ్యారు.
అంతకుముందు పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఉదయం 7.30 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు అంబర్ పేటలోని జ్యోతిరావు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పి్ంచారు కిషన్ రెడ్డి. కొద్ది రోజుల క్రితం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను తప్పించి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించిన సంగతి తెలిసిందే.