ఆపద వేళ రాజకీయాలొద్దు.. మోరంచపల్లిని ఆదుకుందాం

ఆపద వేళ రాజకీయాలొద్దు.. మోరంచపల్లిని ఆదుకుందాం

వరదలు వచ్చి సర్వస్వం కోల్పోయిన బాధితుల దగ్గరికి వచ్చి రాజకీయాలు చేయొద్దని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​చీఫ్​ కిషన్​రెడ్డి అన్నారు.   జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న మోరంచపల్లి గ్రామస్థులను ఆయన జులై 30న పరామర్శించారు. 

బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విపత్తు నిర్వహణ నిధులు రూ.900 కోట్లు రాష్ట్ర వాడుకోవాలని సూచించారు. వాటితో వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రూ.4 లక్షల్లో... రూ.3 లక్షలను కేంద్రమే చెల్లిస్తుందని కిషన్​ రెడ్డి చెప్పారు. 

గ్రామంలో దాదాపు 325 ఇళ్లు దెబ్బతిన్నాయని అన్నారు. వరద బాధితులకు సమాజం అండగా నిలవాలన్నారు. అనంతరం పబ్లిక్​ తో మాట్లాడి ఓదార్చారు. రాష్ట్రంలో వర్షాలు సృష్టించిన బీభత్సాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జులై 31న కేంద్ర బృందాలు వస్తున్నాయని.. బాధితులకు బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.