
వరల్డ్ బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్‌గా నల్గగొండ జిల్లా, పోచంపల్లి గ్రామం ఎంపిక కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల నుంచి పలు ప్రతిపాదనలు వచ్చాయని.. పోచంపల్లిని ముందుగా ఎంపిక చేశామన్నారు. 130 గ్రామాలు కేంద్రం దృష్టికి వస్తే.. మూడు విలేజ్‌లను ఎంపిక చేసి యునెస్కోకు పంపామన్నారు. ఇందులో భాగంగానే బెస్ట్ టూరిస్ట్ విజిటింగ్ విలేజ్‌గా పోచంపల్లిని యునెస్కో అంగీకరించిందని చెప్పారు.
వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక జీవనోపాధి కల్పించేది నేత రంగమన్నారు. నేత కార్మికుల కష్టాలు, సేవల్ని దృష్టిలో పెట్టుకుని వారికి గౌరవం కల్పించే దిశగా కేంద్రం.. పోచంపల్లిని ఎంపిక చేసి యునెస్కోకు పంపిందన్నారు. రామప్ప ఆలయానికి కూడా ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చి సక్సెస్ అయ్యామన్నారు.