ఉండిపోవే నాతోనే బంగారం

ఉండిపోవే నాతోనే బంగారం

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా  కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రం ‘కిష్కంధపురి’. గురువారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా, జావేద్ అలీ పాడాడు.  

‘చుక్కలకు చుట్టానివా.. మబ్బులకు సంద్రానివా.. నింగి నేల దారే వేసే వర్షానివా వర్ణానివా.. చక్కనైన చిత్రానివా..రంగులున్న చైత్రానివా.. దిక్కులను దాటేద్దామే నాతో వస్తావా.. ఉండిపోవే.. నాతోనే బంగారం..’ అంటూ సాగిన పాటలో సాయి శ్రీనివాస్, అనుపమ జోడీ ఆకట్టుకుంది.  

బీచ్‌‌‌‌సైడ్ విజువల్స్ చాలా ప్లజెంట్‌‌‌‌గా  ఉంటే రాజు  సుందరం కొరియోగ్రఫీ సాంగ్ వైబ్‌‌‌‌ను మరింతగా పెంచింది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌‌‌లో సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘ఇదొక హారర్ మిస్టరీ.  

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని చెప్పాడు.  ఇందులో చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయని అనుపమ చెప్పింది. ఈ సాంగ్‌‌‌‌ను తాను చదువుకున్న కాలేజీలో లాంచ్ చేయడం ఆనందంగా ఉందని డైరెక్టర్ కౌశిక్ అన్నాడు.