ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌‌‌‌‌‌‌‌గా కేఎల్ వర్సిటీ ..హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ ఏఐ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం

ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌‌‌‌‌‌‌‌గా కేఎల్ వర్సిటీ ..హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ ఏఐ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌తో ఒప్పందం

హైదరాబాద్, వెలుగు:  హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ ఏఐ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌తో  కలిసి కేఎల్ వర్సిటీ.. దేశంలోనే తొలిసారిగా ఏజెంటిక్ ఏఐ క్యాంపస్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తోంది.  యూనివర్సిటీ ప్రాంగణంలో ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పంద పత్రాలపై కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె. పవన్ కుమార్, హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ ఏఐ ల్యాబ్స్ జాతీయ అధిపతి (ఏవీపీ) దీపక్ శరవణన్ సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్ ప్రతినిధులు సందీప్ (ప్రాంతీయ అధిపతి), సుమిత (ఆపరేషన్స్ హెడ్)లతో పాటు కేఎల్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి. పార్ధసారధి వర్మ, వైస్ చాన్సలర్లు డాక్టర్ ఎన్. వెంకట్రామ్, డాక్టర్ కె. రాజశేఖరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. పవన్ కుమార్, స్కిల్ డెవలప్ మెంట్ డీన్ డాక్టర్ ఎ. శ్రీనాధ్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ కేఆర్ఎస్.ప్రసాద్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులను కేవలం ఏఐ వినియోగదారులుగా కాకుండా స్వయంప్రతిపత్తి గల ఏఐ ఏజెంట్ల సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. డిగ్రీ కోర్సులు, ల్యాబ్స్, ప్రాజెక్టుల్లో దశలవారీగా ఏఐని జోడించనున్నారు. ఈ సందర్భంగా కేఎల్ వర్సిటీ చాన్సలర్ కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ..

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో ఈ క్యాంపస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఐని కేవలం ఒక సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌లా కాకుండా, మొత్తం అభ్యసన వ్యవస్థలో భాగం చేస్తున్నామని, తద్వారా విద్యార్థులు వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే సరికొత్త ఉత్పత్తులను రూపొందించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.