జమిలి ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయం

జమిలి ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయం
  • ప్రజాపయోగ బిల్లుల కోసమే పార్లమెంట్ సెషన్
  • ప్రతిపక్షాలకు హిందువు ఓట్లు అవసరం లేదా?

జమిలీ ఎన్నికల అంటే ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పలు బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడానికి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని, ప్రత్యేక సమావేశాలు పెడితే ప్రతిపక్షాలు ఎందుకు బయపడుతున్నాయని ప్రశ్నించారు. జమిలీ ఎన్నికల మీద విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం కొడుకు, మంత్రి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యా ఖ్యలు చేస్తే నోరు విప్పకపోవడం శోచనీయమని అన్నారు.  

ప్రతిపక్షాలకు హిందువుల ఓట్లు అవసరం లేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. సికిం ద్రాబాద్ నియోజకవర్గంలో మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్, కుట్టు మిషన్ లను మహిళలకు అం దచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె. లక్ష్మణ్ హాజరయ్యారు. ప్రధాని మోడీ ప్రభు త్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని,మహిళలకు చట్ట సభల్లో స్థానం కల్పించారని, మహిళలకు ఆత్మగౌరవ నిలయాలుగా స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించారని కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సంద ర్భంగా మహిళల కోసం కంప్యూటర్ కోచింగ్ సెంటర్లు, కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ నాయకురాలు మేకల కీర్తి హర్షకి రణ్ ను కె. లక్ష్మణ్ అభినందించారు.