Postal Insurance: వృద్ధాప్యానికి బెస్ట్ పోస్టల్ ఇన్సూరెన్స్.. చేతికి రూ.31 లక్షలు..!

Postal Insurance: వృద్ధాప్యానికి బెస్ట్ పోస్టల్ ఇన్సూరెన్స్.. చేతికి రూ.31 లక్షలు..!

Gram Suvidha Scheme: భారతదేశంలో గ్రామీణ ప్రజలు ఇప్పటికీ ఎక్కువగా తమ ఆర్థిక, బ్యాంకింగ్, సేవింగ్స్ వంటి ప్రాథమిక అవసరాల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్ సేవలనే వినియోగిస్తోంది. ఎన్ని కొత్త సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినప్పటికీ ప్రజల ఆదరణ పోస్టాఫీసుకు ఏమాత్రం తగ్గలేదు. దీనికి అనుగుణంగానే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ పథకాలను రూపొందిస్తోంది. గ్రామీణ భారతీయ ప్రజలకు ఇవి అత్యంత ప్రయోజనకరంగా మారాయి.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పోస్ట్ ఆఫీస్ గ్రామ సువిధ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించే. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పిస్తోంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ పాలసీదారులకు భవిష్యత్తులో రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఇది ప్రజల దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు సహాయకారిగా నిలుస్తుంది. 

ఇక స్కీమ్ వివరాల్లోకి వెళితే.. గ్రామ సువిధ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీసం 19 ఏళ్ల వయస్సు నుంచి గరిష్ఠంగా 45 ఏళ్లు ఉండాలి. ఈ పాలసీ కింద కనీసం రూ.10వేల నుంచి గరిష్ఠంగా రూ.10  లక్షల వరకు హామీ ఇవ్వబడుతోంది. పాలసీదారులు దీని చెల్లింపులను నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షికం లేదా వార్షికంగా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించబడింది. ఎవరైనా వ్యక్తి 19 ఏళ్ల వయస్సులో స్కీములో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. వారు 41 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తి 45 ఏళ్ల వయస్సులో పాలసీని కొనుగోలు చేస్తే కేవలం 15 ఏళ్లు మాత్రమే ప్రీమియం చెల్లించేందుకు వీలు ఉంటుంది. ఇక్కడ కాలాన్ని బట్టి వారు చెల్లించే ప్రీమియం మెుత్తాలు మారుతుంటాయి. 

ఏదైనా కారణం వల్ల పాలసీదారుడు పథకం వ్యవధిలో మరణిస్తే, అప్పటి వరకు బోనస్‌లతో పాటు హామీ ఇచ్చిన మొత్తాన్ని నామినీకి పాలసీ కింద అందించబడుతుంది. పాలసీదారుడు 60 ఏళ్ల వయస్సు వరకు జీవించి ఉంటే, మెచ్యూరిటీ సమయంలో అతనికి హామీ ఇవ్వబడిన మొత్తం, బోనస్ మొత్తం చెల్లించబడుతుంది. 

►ALSO READ | Monday Markets: ఈవారం మార్కెట్ల దారెటు..? ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలివే..!

ఈ పథకంలో మరో ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే ఇది రుణం తీసుకునే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. 4 సంవత్సరాల తర్వాత పాలసీదారుడు రుణం తీసుకునే హక్కును పొందుతారు. ఏదైనా అత్యవసర ఆర్థిక పరిస్థితి ఎదురైనప్పుడు ఈ సౌకర్యం ప్రయోజనకరంగా నిలుస్తుంది. అలాగే వారు కావాలనుకుంటే మూడేళ్ల తర్వాత పాలసీని సరెండర్ చేసేందుకు కూడా అవకాశం కల్పించబడింది. అలాగే స్కీమ్ పాలసీదారులు చెల్లించిన ప్రతి రూ.వెయ్యికి రూ.60 చొప్పున బోనస్ అందిస్తుంది. 

ఉదాహరణకు వ్యక్తి 25 ఏళ్ల వయస్సులో రూ.10 లక్షలకు పాలసీని కొనుగోలు చేశారనుకుంటే.. అతని నెలవారీ ప్రీమియం రూ. 1,724గా ఉంటుంది. అతను ఈ ప్రీమియంను రాబోయే 35 సంవత్సరాలు చెల్లిస్తూనే ఉంటారు. అంటే 60 ఏళ్ల వయస్సులో అతనికి దాదాపు రూ.31 లక్షలు చేతికి అందుతాయి. వృద్ధాప్యంలో ఈ మెుత్తం వారికి ఆర్థికంగా భరోసాను కల్పిస్తుంది.