మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ సరిపోతలేదా..? ఈ 5 టిప్స్ ఫాలో అయితే హాస్పిటల్ బిల్స్ తగ్గుతాయ్..!

మీ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ సరిపోతలేదా..? ఈ 5 టిప్స్ ఫాలో అయితే హాస్పిటల్ బిల్స్ తగ్గుతాయ్..!

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవటం తప్పనిసరిగా మారిపోయింది. అయితే స్టాండర్డ్ పాలసీలు తీవ్రమైన వ్యాధుల నుంచి కవరేజ్ అందించవని పాలసీలు కొంటున్న అనేక మందికి అస్సలు తెలియదు. అలాంటి సమయాల్లో పాలసీ ఉన్నప్పటికీ కష్టపడి సంపాదించిన డబ్బు ఖర్చు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా రూ.10 లక్షల కవరేజీ ఉన్నా పఠాణీల్లా నమిలేస్తున్నాయి హాస్పిటళ్లు. అందుకే పాలసీని కొనేముందే సరిగ్గా సెలెక్ట్ చేసుకోవటం చాలా ముఖ్యం అని గుర్తుంచుకోవాలి.

ప్రస్తుతం జీఎస్టీ తొలగింపుతో చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు దీనిని హైలైట్ చేసి కొత్త పాలసీలు వేలల్లో లక్షల్లో అమ్మేస్తున్నారు. కానీ అటు ఏజెంట్లు, ఇటు ఇన్సూరెన్స్ కొనుగోలుదారులు ముఖ్యమైన అంశాలను మర్చిపోతున్నారు. పాలసీలు కొన్న వాళ్లు కూడా హమ్మయ్యా మేము సేఫ్ అనుకుని భ్రమలో బతుకుతున్నారు. అయితే బేసిక్ పాలసీలు అంటగట్టిన సంగతి పాలసీదారులు తర్వాత తెలుసుకుని బోరున ఏడుస్తున్నారు. వీటి కింద క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, పెరాలసిస్ లాంటి అనారోగ్యాలకు కవరేజ్ ఉండదు. ఇలాంటి పాలసీలు కొని డబ్బులు గంగపాలు చేసుకుంటున్నారు అవగాహన లేక చాలా మంది. మరి ఏం చేయాలి..

అందుకే ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనేటప్పుడు తప్పకుండా క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ దానికి యాడ్ చేసుకోవాలి. అయితే దీనికి కొంత అదనపు ప్రీమియం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రోగం బయటపడినప్పటి నుంచి వైద్య ఖర్చులు, ఇంటి ఖర్చులు, జీతం కోల్పోయినందుకు కూడా రికవరీ కాలానికి కవరేజ్ అందిస్తాయి. అందుకే బుర్రపెట్టి ఇన్సూరెన్స్ బ్రోకర్లు చెప్పే మాయమాటల సమయంలో ఆలోచించుకుని పాలసీ కొనుక్కోవాలి. ఇది దీర్ఘకాలంలో అంటే భవిష్యత్తులో అనారోగ్యం వచ్చినప్పుడు నిజంగా మీ డబ్బును కాపాడుతుంది. 40 ఏళ్లు దాటి హైరిస్క్ ప్రొఫెషన్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కోవటం మర్చిపోకండి.  

ఇన్సూరెన్స్ పాలసీదారులు ఫాలో అవ్వాల్సిన టిప్స్.. 
1. ప్రస్తుతం మీరు కొన్న పాలసీలో క్రిటికల్ ఇల్ నెస్ రైడర్ లేకుండా వెంటనే అదనపు పేమెంట్ చేసి యాడ్ చేసుకోండి
2. ప్లాన్ కింద కనీసం 10 నుంచి 15  ప్రమాదకర రోగాలు కవర్ అయ్యేలా చూస్కోండి
3. ఇంట్లో అందరికీ కవరేజ్ లభించేలా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ ఎంపిక ఉత్తమం.
4. పాలసీ కొనేటప్పుడే వెయిటింగ్ పిరియడ్ అలాగే ఉన్న అనారోగ్యాలకు కవరేజ్ కండిషన్స్ అడిగి తెలుసుకోండి. 
5. ఇన్సూరెన్స్ పాలసీ పేమెంట్స్ పై సెక్షన్ 80డి కింద టాక్స్ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని మర్చిపోకండి.