Power Saving: ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే ఏసీ పవర్‌బిల్ 40 % తగ్గిపోతుంది

Power Saving: ఈ ఒక్క చిట్కా ఫాలో అయితే ఏసీ పవర్‌బిల్ 40 % తగ్గిపోతుంది

AC Bill Saving: ప్రస్తుతం భారతదేశంలో వేసవి కాలం మెుదలైంది. వేసవి అనగానే అందరికీ సహజంగా గుర్తుకొచ్చేవి రెండే ఒకటి మామిడి పళ్లు, రెండోది ఏసీలు. అవును ఎండ వేడిమి నుంచి తప్పించుకోవటానికి చాలా మంది కూలర్స్, ఏసీలు వంటి సాధనాలను వినియోగించటం ప్రస్తుతం సర్వ సాధారణంగా మారిపోయింది. 

అయితే ఏసీలను రోజూ వినియోగించటం ఇంట్లో పవర్ బిల్లును కూడా పెంచుతుంది. ప్రస్తుతం ఏపీలో గృహవినియోగదారుల పవర్ ఛార్జీలను పెంచిన నేపర్థ్యంలో తక్కువగా కరెంట్ వినియోగించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఏసీలను వినియోగించేటప్పుడు చిన్న చిట్కాను పాటించటం వల్ల దాదాపు 40 శాతం వరకు కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి గణాంకాలను ఇప్పుడు పరిశీలిద్దాం.. 

మీరు ఏసీని 24 డిగ్రీల వద్ద రోజుకు 4 గంటలు నడిపితే నెలకు రూ.వెయ్యి 251 బిల్ వస్తుంది. అదే 18 డిగ్రీల వద్ద నడిపితే బిల్లు రూ.2వేల 054 అవుతుంది.

అలాగే రోజుకు మీరు ఏసీని 24 డిగ్రీల వద్ద రోజుకు 8 గంటలు నడిపితే నెలకు రూ.2వేల 768 బిల్ వస్తుంది. అదే 18 డిగ్రీల వద్ద నడిపితే బిల్లు రూ.4వేల 602 అవుతుంది.

ఇక ఏసీని ఎక్కువగా వినియోగించే వారిని పరిశీలిస్తే వారు కనీసం రోజుకు 12 గంటల పాటు ఏసీని రన్ చేసినట్లయితే.. 24 డిగ్రీల వద్ద అయితే రూ.4వేల 390 బిల్ వస్తుండగా.. అదే 18 డిగ్రీల వద్ద ఏసీ రన్ అయితే రూ.7వేల 404 కరెంట్ బిల్ వస్తుంది. దీని ప్రకారం 24 డిగ్రీల వద్ద అంటే రూమ్ టెంపరేచర్ ఫాలో అయితే కరెంట్ బిల్ దెబ్బకు 40 శాతం తగ్గిపోతుంది.