V6 News

చట్టాలు తెలుసుకో.. అవగాహన పెంచుకో.. గచ్చిబౌలి ‘భరోసా’ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్

చట్టాలు తెలుసుకో.. అవగాహన పెంచుకో.. గచ్చిబౌలి ‘భరోసా’ ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్

గచ్చిబౌలి, వెలుగు: 99 రోజుల ‘ప్రజాపాలన’ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గచ్చిబౌలి భరోసా కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం గచ్చిబౌలి భరోసా కేంద్రంలో డీసీపీ సృజన, ఏసీపీ కృష్ణ ప్రసాద్, భరోసా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ యాదయ్య, షీ టీమ్స్ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ హనుమాన్, భరోసా టీమ్​సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా హఫీజ్​పేటలోని డీ-మార్ట్, హెచ్​పీ పెట్రోల్ బంక్ తో పాటు కొండాపూర్ ఏరియా దవాఖాన ప్రాంగణాల్లో ప్రజలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం ఉన్న పోక్సో, పోష్​యాక్ట్, బాల్య వివాహాల నిరోధక చట్టాల గురించి వివరించారు.  

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఫొటో మార్ఫింగ్, డిజిటల్ స్కామ్‌‌‌‌‌‌‌‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. డయల్100, 1098, 181 వంటి అత్యవసర నంబర్ల గురించి వివరించారు. కార్యక్రమంలో సెంటర్​అడ్మిన్​లావణ్య, కౌన్సిలర్​ధరణి, లీగల్​కౌన్సిలర్లు పవిత్ర, అంజలి, జీఎన్​ఎం నాగమ్మ, సపోర్ట్​పర్సన్​మిథాలి రాజ్​పాల్గొన్నారు.