ట్రంప్ టారిఫ్స్: ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ బెస్ట్.. తెలుసుకోండి ఇన్వెస్టర్స్!

ట్రంప్ టారిఫ్స్: ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ బెస్ట్.. తెలుసుకోండి ఇన్వెస్టర్స్!

Mutual Funds: అమెరికా అధ్యక్షుడుగా జనవరిలో ట్రంప్ వచ్చిన నాటి నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బతింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇండియాపై ప్రకటించిన 50 శాతం టారిఫ్స్ కారణంగా భారత వృద్ధి 1 శాతం మేర ప్రభావితం కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు కూడా భారీ ఒడిదొడుకులను చూస్తున్నాయి. చాలా మంది గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్ వైపు తమ పెట్టుబడి మళ్లించాలని ప్లాన్ చేస్తున్నారు. 

రష్యా నుంచి చమురు కొంటున్నామనే సాకుతో అమెరికా భారత ఎగుమతులపై 25 శాతం సెకండరీ టారిఫ్స్ ప్రకటించింది. దీంతో మెుత్తంగా అమెరికాలో భారతీయ వస్తువులు అమ్మాలంటే 50 శాతం టారిఫ్స్ రూపంలో చెల్లించాల్సిందే. ట్రంప్ అధికారంలో నుంచి దిగిపోయే వరకు ప్రపంచ దేశాలకు కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితులు ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్రను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు. 

ALSO READ : ఆగస్ట్‎లో ఇండియా పర్యటనకు పుతిన్

అధిక ఓలటాలిటీ, అనిశ్చితి కలిగి ఉన్న ప్రస్తుత సమయంలో ఎలాంటి ఫండ్స్ లేదా స్కీమ్స్ బెస్ట్ అని సెర్చ్ చేస్తున్నారు. అయితే దీనిపై నిపుణులు ఏమంటున్నారో గమనిద్దాం. మార్కెట్లలో ఉన్న అనిశ్చితుల కారణంగా ప్రస్తుతం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉత్తమంగా క్యాపిటల్ లీగ్ ప్రతినిధి రాజుల్ కొఠారి చెప్పారు. ఇక ఒకేసారి పెద్ద మెుత్తంలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు బ్యాలెన్స్ అడ్వాన్టేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ స్కీమ్స్ మంచిదని సూచించారు. 

ఇలాంటి సమయంలో ఒకే రకం లేదా కేటగిరీ ఫండ్స్ కాకుండా తమ పెట్టుబడులను ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి అన్ని రకాల్లోకి మళ్లించటం ఉత్తమంగా సూచిస్తున్నారు కొఠారి. కొందరు నిపుణులు ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఇలాంటి సమయంలో మంచిదని అంటున్నారు. వీలైతే ఇన్వెస్టర్లు కొంత డబ్బును టాక్స్ సేవింగ్ ఫండ్స్ కి కూడా అలకేట్ చేయటం మంచి రాబడిని ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం సమయంలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలోని ఫండ్స్ కూడా పరిశీలించొచ్చని చెప్పారు కొఠారియా. మంచి వ్యాల్యుయేషన్ కలిగిన లార్జ్ క్యాప్ ఫండ్స్ టెన్షన్స్ తగ్గిస్తాయని అయితే గోల్డ్, సిల్వర్ లాంటి వాటికి కూడా కొంత చోటివ్వటం హెడ్జింగ్ కోసం పనికొస్తుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.