
న్యూఢిల్లీ: భారత్-రష్యా స్నేహా బంధాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత హెచ్చరించిన భారత్ రష్యాతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తుండటాన్ని తట్టుకోలేకపోతున్నా ట్రంప్.. ఇండియాపై వాణిజ్య సుంకాలు విధిస్తూ శునకానందం పొందుతున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న నెపంతో ఇప్పటికే ఇండియాపై 50 శాతం ట్రారిఫ్లు విధించారు. ట్రంప్ భారత్‌పై ఏకపక్షంగా సుంకాలు విధిస్తుండటంతో న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ తరుణంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. 2025 ఆగస్ట్‌లో పుతిన్ ఇండియాలో పర్యటించనున్నారు.
ప్రస్తుతం రష్యా పర్యటనలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ఏడాది పుతిన్ ఇండియాకు వస్తారని చెప్పిన అజిత్ దోవల్.. ఎప్పుడూ వస్తాడనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఇంటర్‌ఫ్యాక్స్ వార్తా సంస్థ మాత్రం ఈ ఏడాది చివర్లో పుతిన్ ఇండియా పర్యటనకు వెళ్తాడని పేర్కొంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత ఇదే పుతిన్ తొలి భారత పర్యటన. ఓ వైపు రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్ హెచ్చరిస్తుంటే.. మరోవైపు పుతిన్ భారత పర్యటనకు రావడం ప్రపంచదేశాల్లో చర్చనీయాంశంగా మారింది. పుతిన్ భారత పర్యటనపై అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
భారత్‌పై 24 గంటల్లో మరిన్ని అదనపు సుంకాలు విధిస్తానన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేసిన విషయం తెలిసిందే. భారత్‌పై మరో 25 శాతం అదనపు సుంకాలు విధించారు. తొలుత 2025, జూలై 30న ఇండియాపై 25 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్.. 2025, ఆగస్ట్ 6న మరో 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు 2025, ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజా సుంకాలతో భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లు విధించింది అమెరికా. భారతపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తూ బుధవారం (ఆగస్ట్ 6) కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు ట్రంప్. దీంతో ఇప్పటి నుంచి అమెరికాలో భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు అమలు కానున్నాయి. అమెరికా హెచ్చరించినప్పటికీ రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తుండటంతోనే ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు విధించారని వైట్ హౌజ్ ధృవీకరించింది.