
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను సిఫారసు చేస్తూ తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేబినెట్ మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను సిఫారసు చేసింది. అయితే కోదండరాం పేరుతో పాటు ఈ సారి అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు స్థానం కల్పించింది ప్రభుత్వం.
ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్ అలీఖాన్ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ 2024 ఆగస్టులో సుప్రీంకోర్టులో సివిల్ అప్లికేషన్(సీఏ) దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో ప్రొఫెసర్కోదండరాం, ఆమిర్ అలీ ఖాన్ కేసు విషయంలో 2025 ఆగస్టు 13 న స్టే విధించింది. 2024 ఆగస్టు 14న తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల తర్వాత జరిగిన పరిణామాలు ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉంటే ఎమ్మెల్సీల నియామకాన్ని రద్దు చేస్తామని వ్యాఖ్యానించింది. అయితే.. ఏదైనా తుది ఉత్తర్వులకు లోబడే ఉంటుందని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణను 2025 సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
ALSO READ : తెలంగాణలో రిజర్వేషన్ కోటా పరిమితి ఎత్తివేత
ఈ క్రమంలో మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్లను సిఫారసు చేసింది తెలంగాణ కేబినెట్.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. అయితే ఈ సారి అమీర్ అలీ ఖాన్ ప్లేసులో అజారుద్దీన్ కు అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున కొత్త అభ్యర్థికి అవకాశం రానుంది.