
నాగర్ కర్నూల్: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. యురేనియం తవ్వకాలపై అవగాహన కల్పించేందుకు నల్లమల బయలుదేరిన కోదండరాంను అచంపేట మండలం హజీపూర్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. కోదండరాం అరెస్టును నిరసిస్తూ… అమ్రాబాద్ మండలం మున్ననూరు వద్ద శ్రీశైలం హైవే ను దిగ్భందించారు అక్కడి స్థానికులు .ఆందోళనకారులు రోడ్డుపై బైటాయించడంతో హైద్రాబాద్ – శ్రీశైలం హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.