V6 News

అప్పుడు ఎవ్వరినీ కలిసే చాన్స్ లేదు..ఇప్పుడు మంత్రులను కలిసి సమస్య చెప్పొచ్చు: కోదండరాం 

అప్పుడు ఎవ్వరినీ కలిసే చాన్స్ లేదు..ఇప్పుడు మంత్రులను కలిసి సమస్య చెప్పొచ్చు: కోదండరాం 

పద్మారావునగర్, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసే చాన్సే లేదని, ప్రస్తుత ప్రభుత్వంలో సమస్యలను మంత్రులకు వివరించే వెసులుబాటు ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులకు ప్రొఫెసర్ సంఘీభావం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ ఫొటోకు నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన పోరాటానికి తెలంగాణ జనసమితి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ సికింద్రాబాద్​ఇన్​చార్జి నగేశ్​ పటేల్​ఉన్నారు. జూబ్లీ బస్​ స్టేషన్​ నుంచి కంటోన్మెంట్​ డిపో వరకు ర్యాలీ  నిర్వహించారు.