V6 News

పదవులు ఎవరికీ శాశ్వతం కాదు : టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం

పదవులు ఎవరికీ శాశ్వతం కాదు :  టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం
  • టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం
  •     గతంలో మేం మాట్లాడినవే కవిత మాట్లాడుతున్నరు
  •     రాష్టంలో ఒక మహిళ పార్టీ పెట్టడం అభినందనీయమని కామెంట్

హైదరాబాద్, వెలుగు: పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, ఎమ్మెల్సీ పదవి గురించి తాను ఏనాడూ ఆలోచించలేదని తెలంగాణ జన సమితి ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎమ్మెల్సీ పేర్లను గవర్నర్ ఆమోదించడంపై శనివారం టీజేఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసన మండలిలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తానని చెప్పారు. 

తన దృష్టికి వచ్చిన సమస్యలను సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. గత పదేండ్లు బీఆర్ఎస్ లో ఏం జరిగిందో మేం మొదటి నుంచి చెబుతున్న మాటలను ఇప్పుడు కవిత ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత ఈ అంశాలను ప్రస్తావిస్తే బాగుండేదని, ఇప్పుడు మాట్లాడితే ప్రజలు నమ్మరని తెలిపారు. రాష్ర్టంలో ఒక మహిళ పార్టీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.