ప్రభుత్వ యూనివర్సిటీలకు ఉరి...ప్రైవేట్ వర్సిటీలకు హారతి

ప్రభుత్వ యూనివర్సిటీలకు ఉరి...ప్రైవేట్ వర్సిటీలకు హారతి

సీఎం కేసీఆర్ ప్రభుత్వ యూనివర్సిటీలకు ఉరి వేసి...ప్రైవేట్ యూనివర్సిటీలకు హారతి పడుతున్నారన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఉన్నత విద్యను  టీఆరెస్ నేతల చేతుల్లో పెడుతున్నారన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్న ఆయన.. ప్రభుత్వ విధానాల్లో స్పష్టత ఉండడం లేదన్నారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల పంట వేయకుండా ఉన్న రైతులను, బీడు భూములుగా  మార్చిన  రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. ఉద్యోగ నియామకాల విషయాల్లో టీఎస్ పిఎసికి అధికారం ఇవ్వాలన్నారు. 111జీవో ఎతెస్తే జంట జలశయాలకు పరిరక్షణ పరిస్తితి ఏంటని ప్రశ్నించారు.

జంట జలాశయాలను కాపడకుంటే భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ మునిగిపోయే ప్రమాదం ఉంటదన్నారు. రియల్ ఎస్టేట్ ప్రయోజనం కోసమే 111జీవో ఏతేస్తున్నారని.. కంపెనీల పేరుతో రైతుల నుండి భూములు లాక్కుంటున్నారని చెప్పారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే, రాష్ట్రం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై మరింత భారం మోపారన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతమొందించి ప్రావ్వామిక పాలన కోసం మా వంతు కృషి చేస్తున్నామన్నారు. డీజిల్, పెట్రోల్ గ్యాస్ ధరలపై పన్ను భారం  రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు కోదండరాం.

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత

ఇకపై లంచ్ బ్రేక్ అరగంటే..