
- జూన్9 నుంచి 14 వరకు స్పెషల్ లోక్ అదాలత్
కొడంగల్, వెలుగు: పెండింగ్లో ఉన్న చెక్బౌన్స్కేసులను రాజీ చేసుకోవాలని, దీనివల్ల సమయం, డబ్బు రెండూ వృథా కావని కొడంగల్మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ సూచించారు. మంగళవారం కొడంగల్ కోర్టులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు సీజే, స్టేట్ లీగల్ సెల్ అథారిటీ ఆదేశాల మేరకు రూ.5 లక్షల వరకు ఉన్న చెక్ బౌన్స్కేసులను జూన్9 నుంచి14 వరకు నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇదివరకు ఇటువంటి కేసుల రాజీకి ముందుగా నగదు కోర్టులో డిపాజిట్చేయాల్సి ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు పూర్తిగా మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే, బ్యాంక్ ల పరిధిలోని కేసులనూ రాజీ చేసుకోవచ్చని చెప్పారు. జూన్14న నిర్వహించే జాతీయ మేగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.