కొడంగల్, వెలుగు: కొడంగల్ మున్సిపాలిటీ2024–-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం సోమవారం జరిగింది. మున్సిపల్ చైర్మన్జగదీశ్వర్రెడ్డి అధ్యక్షత వహించారు. మున్సిపాలిటీలో ఏడాదికి రూ. 41.38 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో ఖర్చులకు రూ. 41.32కోట్లు పోను మిగులు బడ్జెట్రూ.6 లక్షలని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ ఉషారాణి, కమిషనర్ బలరాం నాయక్, ఏఈ రాకేశ్రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్సభ్యులు పాల్గొన్నారు.

