రైళ్ల సురక్షిత నిర్వహణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి : జీఎం సంజయ్కుమార్శ్రీవాస్తవ

రైళ్ల సురక్షిత నిర్వహణకు  అధికారులు అప్రమత్తంగా ఉండాలి :  జీఎం సంజయ్కుమార్శ్రీవాస్తవ
  •     రైళ్ల భద్రతా చర్యలపై జీఎం సంజయ్​కుమార్​శ్రీవాస్తవ

హైదరాబాద్​సిటీ, వెలుగు : జోన్‌‌‌‌ పరిధిలో రైళ్ల భద్రత అంశంలో అన్ని స్థాయిల  అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్​కుమార్​ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సిబ్బందికి క్రమం తప్పకుండా రిఫ్రెషర్‌‌‌‌ కోర్సులు నిర్వహించాలన్నారు. సోమవారం రైల్ నిలయంలో జోన్ పరిధిలోని రైళ్ల భద్రత అంశంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

దీనికి దక్షిణ మధ్య రైల్వే అడిషనల్​జీఎం సత్య ప్రకాష్‌‌‌‌, ఇతర శాఖల అధిపతులు హాజరుకాగా, సికింద్రాబాద్ , హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్‌‌‌‌ఎంలు వీడియో కాన్ఫరెన్స్​ద్వారా పాల్గొన్నారు. సంజయ్​ కుమార్​ శ్రీవాస్తవ మాట్లాడుతూ నాన్-ఇంటర్‌‌‌‌లాకింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. పాయింట్లు, క్రాసింగ్‌‌‌‌ల వద్ద భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నారు.