కొడంగల్లో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ షురూ..

కొడంగల్లో వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ షురూ..

కొడంగల్, వెలుగు: కొడంగల్​ పట్టణంలోని శ్రీమహాలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలయం చుట్టూ ఉన్న ఇండ్లను అధికారులు జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. కొత్తగా గర్భాలయం, పుష్కరిణి, వసతి గదులు, మండపాలు, కల్యాణకట్ట నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 

ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.110 కోట్లు మంజూరు చేసింది. ఆలయం చుట్టూ మూడెకరాల భూ సేకరణకు నోటిఫికేషన్​ఇచ్చింది. సుమారు 100 మంది నిర్వాసితులకు అధికారులు పరిహారం కూడా  అందించారు. ఆలయ పునర్నిర్మాణం విషయంలో సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు, ఇంజినీర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.