
హైదరాబాద్ లో ఎక్స్ పో అంటే మనకు గుర్తుకు వచ్చేది నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరిగే నుమాయిష్. ప్రతీ ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే నుమాయిష్ 45 రోజుల పాటు నగర వాసులకు అన్నీ అందిస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లభించే ప్రత్యేకమైన వస్తువులు, దుస్తులు నుమాయిష్ అందిస్తుంది. అందుకే ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించేందుకు హైదరాబాద్ తో పాటు..తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ప్రజలు వస్తుంటారు. అయితే నుమాయిష్ లాంటి ఎగ్జిబిషన్ ఇప్పుడు నగర వాసులను ఆకట్టుకుంటోంది. పవిత్ర రంజాన్ మాసంలో చాంద్రాయణగుట్ట బండ్లగూడలోని నూరి ప్యాలెస్‌లో షాపింగ్ ఎక్స్ పో జరుగుతోంది.
పాక్ దుస్తులు కూడా లభిస్తాయి...
రంజాన్ సందర్భంగా చాంద్రాయణగుట్టలో కోహినూర్ ఎక్స్ పో నిర్వహించబడుతుంది. ఇది సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కోహినూర్ ఎక్స్ పో ఉంటుంది. ఇక్కడ భారతీయ సంప్రదాయ దుస్తులే కాదు..పాకిస్తానీ దుస్తులు అందుబాటులో ఉంటాయి. కాశ్మీరీ, లక్నో దుస్తులు ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కోహినూర్ ఎక్స్ పోలో మూడు వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను కొనుగోలు చేస్తే.. బంగారు ఆభరణాలు, లేదా పాకిస్తానీ దుస్తులు గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు.
పిల్లల కోసం..
కోహినూర్ ఎక్స్ పోకు వచ్చే పిల్లలకు షాపింగ్తో పాటు..వారు ఎంజాయ్ చేయడానికి ప్రత్యేకమైన ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. జాయ్ రైడింగ్, బంగీ జంపింగ్ వంటి అనేక వినోద కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్స్‌పోలో అనేక రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. ముస్లింలు ఇఫ్తార్ విందును కూడా ఇక్కడే చేసుకోవచ్చు.ఈ ఎక్స్ పోలో సౌత్ ఇండియన్ దోస, హైదరాబాదీ బిర్యానీ నుండి బార్బెక్యూ వరకు అన్ని రకాల ఆహార పదార్థాలు.. భోజన ప్రియులకు అందుబాటులో ఉన్నాయి.
షాపింగ్..పిల్లలకు ఇష్టమైన వినోదం..అన్ని రకాల ఆహార పదార్థాలు..ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి. పవిత్ర రంజాన్ మాసాన్ని మరింత వినోదంగా..ఉత్సాహంగా జరుపుకోవడానికి ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన వాతావరణాన్ని కోహినూర్ ఎక్స్‌పో అందిస్తుంది,