
పాకిస్తాన్లో ఇటీవల తరచుగా భూప్రకంపనలు ఆ దేశ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే.. 13 రోజుల్లోనే 5 సార్లు పాక్లో భూమి కంపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది భూకంపం కాదని.. పాక్, ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాకిస్తాన్ అణు బాంబు పరీక్షలు చేస్తుందేమోననే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఈ అణు పరీక్షల వల్లే పాకిస్తాన్లో భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయనేది కొందరి వాదన.
ఇండియా, పాక్ మధ్య టెన్షన్ వాతావరణం ఉన్న సమయంలోనే 4.6 తీవ్రతతో పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అంతేకాదు.. భూకంప కేంద్రం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పంజాబ్ ప్రావిన్స్లోనే ఉందని సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) గుర్తించింది. దీంతో.. పాక్ అణు పరీక్షలు చేస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. మూడు రోజుల వ్యవధిలోనే భూమి మూడోసారి కంపించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధాటికి పాకిస్తాన్ లో న్యూక్లియర్ బేస్ కూడా దెబ్బతిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత వైమానిక దళం జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో పాకిస్తాన్లోని సర్గోదాలో స్టోర్ చేసిన అణ్వాయుధాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఇక.. న్యూక్లియర్ వార్ హెడ్స్ విషయానికొస్తే.. మన దగ్గర ప్రస్తుతం 180 న్యూక్లియర్వార్హెడ్స్ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 వార్‌హెడ్స్ ఉండటం గమనార్హం. ఇండియా నేలపైనుంచి ప్రయోగించగల అగ్ని–3 బాలిస్టిక్ మిస్సైల్రేంజ్ 2,000 మైళ్లు. దాదాపు 3,219 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ని కొట్టగలదు.
రష్యాతో కలిసి రూపొందించిన బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్‌ని ట్రియాడ్గా (మూడు చోట్ల నుంచి) ప్రయోగించవచ్చు. న్యూక్లియర్ బాంబులను వదిలేవిధంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిమానాలను మార్చారు. వీటితోపాటుగా 6,000 టన్నుల కెపాసిటీతో అరిహంత్ బాలిస్టిక్ మిస్సైల్ సబ్‌మెరైన్‌ని పూర్తిగా మన సైంటిస్టులే తయారు చేశారు.