OG Movie: ఓజీ మేకర్స్ షాకింగ్ డెసిషన్.. సడెన్గా సినిమాటోగ్రాఫర్ మార్పు.. కారణం ఇదే!

OG Movie: ఓజీ మేకర్స్ షాకింగ్ డెసిషన్.. సడెన్గా సినిమాటోగ్రాఫర్ మార్పు.. కారణం ఇదే!

ఏపీ డిప్యూటీ సీఎం, స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌‌.. సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇటీవలే హరిహర వీరమల్లు షూట్ కంప్లీట్ చేయగా.. ఇపుడు ఓజీ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓజీ సినిమాటోగ్రాఫర్ చేంజ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఓజీ మూవీ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ తప్పుకున్నాడట. చాలా సందర్భాల్లో ఓజీ  షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో.. వేరే కమిట్ మెంట్స్ ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయ్యారని సమాచారం. ఆయన స్థానంలో మరో స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసను ఓజీ మేకర్స్ నియమించారట.

ప్రస్తుతం రవి కే చంద్రన్.. హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి మూవీకి పనిచేస్తున్నారు. సడెన్‍గా ఓజీ షూట్ మళ్లీ స్టార్ట్ అవ్వడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడట. ఈ కారణంగానే ఆయన ఓజీ నుంచి తప్పుకున్నాడట. దాంతో మనోజ్ పరమహంసను ఓజీ మేకర్స్ తీసుకున్నారని తెలుస్తోంది.

అయితే, ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక సమాచారం అయితే లేదు. క్లారిటీ రావాల్సి ఉంది. హరి హర వీరమల్లు సినిమాకు కూడా మనోజ్ పరమహంసనే సినిమాటోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఓజీకి కూడా ఆయనే రావడంతో షూటింగ్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు టాక్. 

ఇకపోతే.. సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస చాలా టాలెంట్ ఉన్న మేకర్. ఆయన దాదాపు 30 సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసి మంచి గుర్తింపు పొందాడు. తెలుగులో ఏ మాయ చేసావే, రేస్ గుర్రం, కిక్ 2, బ్రూస్ లీ, రాధే శ్యామ్, హరి హర వీరమల్లు, గుంటూరు కారం వంటి సినిమాలకు పనిచేశాడు. 

Also Read : లగ్జరీ ఇల్లు కొన్న అనసూయ

పవన్ కళ్యాణ్ పొలిటికల్‌‌గా బిజీగా ఉండటంతో షూటింగ్‌‌కు బాగా గ్యాప్ వచ్చింది. లేటెస్ట్ గా ఆయన ‘ఓజీ’ చిత్రానికి డేట్స్ కేటాయించారు. దీంతో ఈ మూవీ షూటింగ్‌‌ను తిరిగి ప్రారంభించినట్టు మేకర్స్ తెలియజేశారు.

‘మళ్లీ మొదలైంది... ఈసారి ముగిద్దాం’ అంటూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అతి త్వరలోనే  షూటింగ్ పూర్తవనుందని తెలుస్తోంది.

మరో ఇరవై ఐదు రోజుల పాటు పవన్ కళ్యాణ్‌‌ ఈ చిత్రం షూటింగ్‌‌లో పాల్గొంటే మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. యాక్షన్‌‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్‌‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.