
IT Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ప్రధానంగా ఐటీ రంగానికి చెందిన స్టాక్స్ పతనం అవుతున్నాయి. ప్రపంచ భౌగోళిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులతో పాటు.. ఇండియా పాక్ పరిణామాలతో టెక్ రంగంపై కొంత అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో ఒక దేశీయ ఐటీ సేవల కంపెనీ షేర్లు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎల్టిఐ మైండ్ ట్రీ కంపెనీ గురించే. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కంపెనీ 450 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్ దక్కించుకున్నట్లు ప్రకటించింది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ సుమారు రూ.3వేల 800 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. నేడు మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపుతున్నప్పటికీ ఎల్టిఐ మైండ్ ట్రీ షేర్లు మాత్రం రెండో రోజు కూడా తమ ర్యాలీని కొనసాగిస్తున్నాయి.
నేడు ఇంట్రాడేలో మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో ఎల్టిఐ మైండ్ ట్రీ కంపెనీ షేర్ల ధర స్వల్ప లాభంతో రూ.4వేల 945 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అలాగే నేడు ఇంట్రాడేలో స్టాక్ రేటు రూ.5వేల 039ని తాకింది. గడచిన ఐదు రోజుల్లో స్టాక్ ధర ఏకంగా 7 శాతం వరకు పెరగటం గమనార్హం.
ALSO READ : Market Update: నిన్నటి లాభాల తర్వాత కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ ఎందుకంటే..?
బ్రోకరేజీల మాట ఇదే..
ఎల్టిఐ మైండ్ ట్రీ షేర్లను ట్రాక్ చేస్తున్న 38 మంది నిపుణుల్లో దాదాపు 7 మంది షేర్లకు స్ట్రాంగ్ బై రేటింగ్ అందిస్తుండగా.. 15 మంది కొనుగోలు రేటింగ్ అందించారు. కేవలం 3 మంది మాత్రమే సెల్ రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ప్రముఖ బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపాడియా కంపెనీ షేర్లను రూ.5వేల 100 టార్గెట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చని సూచించారు.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.