ఈ కిరాతకులను పట్టిస్తే.. రూ.20 లక్షలు వెంటనే ఇస్తారు.. మీదే ఆలస్యం..

ఈ కిరాతకులను పట్టిస్తే.. రూ.20 లక్షలు వెంటనే ఇస్తారు.. మీదే ఆలస్యం..

పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.. ఎట్టకేలకు దాయాది దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించడంతో పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి... అయితే ఉగ్రవాదం అణిచివేతే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సీజ్ ఫైర్ కి అంగీకరించి భారత్ వెనక్కి తగ్గిందన్న అసంతృప్తి చాలామందిలో ఉంది.. పహల్గాం ఘాతుకానికి పాల్పడ్డ ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ భారతావని రగిలిపోతోంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ పాకిస్తాన్ ఉగ్రవాదులను పట్టిస్తే రూ. 20 లక్షలు రివార్డు ఇస్తామంటూ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.

ఈ పోస్టర్లలో పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ముగ్గురు కిరాతకులు పాటలతో పాటు.. వీరి గురించి సమాచారం అందించినవారికి రూ. 20లక్షలు రివార్డు ఇస్తామంటూ ప్రకటన ఉంది. జమ్మూ కాశ్మీర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఈ పోస్టర్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద రహిత కాశ్మీర్ కోసం అంటూ సందేశం ఉన్న ఈ పోస్టర్లు  జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. ఉగ్రవాదుల గురించి విశ్వసనీయ సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డును ప్రకటిస్తున్నట్లు పోస్టర్లలో ప్రకటించారు. సమాచారం అందించినవారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏజెన్సీలు హామీ ఇచ్చాయి.

ALSO READ : జమ్ము కశ్మీర్లోని షోపియాన్లో ఎన్ కౌంటర్.. లష్కరే తోయిబా ఉగ్రవాది హతం

పహల్గాం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 25 మంది పర్యాటకులు, ఒక నేపాలీ సహా కనీసం 26 మంది మరణించారు. 2019లో పుల్వామా మారణహోమం తర్వాత కాశ్మీర్ లో జరిగిన దారుణమైన దాడి ఇదే.

లష్కరే తోయిబా (ఎల్‌ఇటి), అనంత్‌నాగ్ కి చెందిన  ఆదిల్ హుస్సేన్ థోకర్, ఇద్దరు పాకిస్తానీలు అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్, హషీమ్ మూసా అలియాస్ సులేమాన్ అనే ముగ్గురు ఉగ్రవాదులు ఈ  దాడికి పాల్పడ్డట్టు భావిస్తున్నారు.