ఆదివాసీలు చదువుకు ప్రాధాన్యతనివ్వాలి :  ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదివాసీలు చదువుకు ప్రాధాన్యతనివ్వాలి :  ఎస్పీ అఖిల్ మహాజన్

నేరడిగొండ (సిరికొండ), వెలుగు: ఆదివాసీలు చదువుకు ప్రాధాన్యత నివ్వాలని, విద్య భవిష్యత్​ను మార్చుతుందని ఆదిలాబాద్​ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరికొండ మండలం కుంట గూడ పరిధి పాలవాగు హామ్లెట్ లో ఆదివాసీలకు మంగళవారం ఫ్రీ హెల్త్​ క్యాంపు నిర్వహించారు. ముందుగా కుమ్రం భీమ్ ఫొటోకు నివాళులర్పించి మాట్లాడారు. ఆదివాసీ ప్రజలు చదువు పై దృష్టి పెట్టాలని, ప్రజలు నాటు వైద్యాన్ని నమ్మకుండా హాస్పిటళ్లను సంప్రదించాలన్నారు.

విద్యార్థులు మంచి విద్యనభ్యసించి ఉన్నత స్థాయి ఉద్యోగాలను సాధించి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రుత్విక్ సాయి, సీఐ రమేశ్,  ఎస్ఐ  పూజ, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పోలీసు వైద్య బృందం సభ్యుడు శాంతరాజ్, సర్పంచ్ మీరాబాయి, డాక్టర్లు, సార్మేడీలు పాల్గొన్నారు.