
ఆస్ట్రేలియాతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. టాప్ ఆర్డర్ స్థాయికి తగ్గట్టుగా ఆడటంతో… స్కోరుబోర్డు పరుగులెత్తింది. స్కిప్పర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. 55 బాల్స్ లో 3 ఫోర్లతో 50 రన్స్ చేశాడు కోహ్లీ. ధావన్ తో కలిసి కోహ్లీ 93 రన్స్ భాగస్వామ్యం అందించాడు. ధావన్ 106 బాల్స్ లో 117 రన్స్ చేసి స్టార్క్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కోహ్లీకి జతగా క్రీజులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు.
విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో ఇది 50వ హాఫ్ సెంచరీ. కోహ్లీ ఖాతాలో 41 సెంచరీలు ఉన్నాయి.