కొల్హాపూర్లో ఉద్రిక్తత ..కొట్టుకున్న రెండు వర్గాలు

కొల్హాపూర్లో ఉద్రిక్తత ..కొట్టుకున్న రెండు వర్గాలు

మహారాష్ట్రలోని కొల్హాపూర్లో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావడంతో రెండు గ్రూపుల మధ్య మతపరమైన వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.  సోషల్ మీడియాలో  వివాదాస్పద పోస్టుకు నిరసనగా..కొన్ని మితవాద సంస్థలు కొల్హాపూర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి.  

కొల్హాపూర్లో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించేందుకు అదనపు పోలీసు బలగాలు, SRPF, RAF బృందాలను రప్పించారు.