టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కేకేఆర్.. ఢిల్లీకి లాస్ట్ ఛాన్స్

టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కేకేఆర్.. ఢిల్లీకి లాస్ట్ ఛాన్స్

ఐపీఎల్ (IPL 2026) ప్లేఆఫ్స్ రేసులో అత్యంత కీలకమైన చివరి లీగ్ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఫలితం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల ప్లేఆఫ్స్ భవిష్యత్తును తేల్చనుంది. ఈ క్రేజీ ఫైట్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మొదట బ్యాటింగ్‌కు దిగనుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం.. ప్లేఆఫ్స్ సమీకరణాలు ఏంటో మాకు బాగా తెలుసు.. వికెట్ చూడటానికి చాలా బాగుంది.. మైదానంలోకి వెళ్లి అద్భుతమైన క్రికెట్ ఆడడమే మా ముందున్న లక్ష్యం.. గత ఆరు మ్యాచ్‌లుగా మా టీమ్ పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా గర్వపడుతున్నాను.. ఈ మ్యాచ్‌లో కూడా ఎలాంటి మార్పులు లేకుండా అదే టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని వెల్లడించారు. 

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేము కూడా మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం.. వచ్చే సీజన్‌లో మేము ఎక్కడ మెరుగవ్వాలో చూసుకుంటాం.. ఈ సీజన్‌లో మేము చెడ్డ క్రికెట్ ఆడామని నేను అనుకోను, కానీ మ్యాచ్‌లను మా వైపు తిప్పుకునే కీలకమైన క్షణాలను అందుకోలేకపోయాం.. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని భవిష్యత్తుపై దృష్టి పెడతామని పటేల్ పేర్కొన్నాడు. 

ఇరు జట్లు: 
ఢిల్లీ క్యాపిటల్స్: అభిషేక్ పోరెల్, KL రాహుల్ (వికెట్ కీపర్), సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, ఔకిబ్ నబీ, లుంగీ ఎన్గిడి, మిచెల్ స్టార్క్

కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), తేజస్వి దహియా (వికెట్ కీపర్), కెమెరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే