ఆన్లైన్ లోనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి

ఆన్లైన్ లోనే సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలి

పశ్చిబెంగాల్లోని కోల్ కతా యూనివర్సిటీ  విద్యార్థులు నిరసన తెలిపారు. సెమిస్టర్ పరీక్షలను ఆన్ లైన్ లో  నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. సెమిస్టర్ పరీక్షలను ఆఫ్ లైన్ లో నిర్వహించొద్దని సూచించారు. సిలబస్ ఇంకా పూర్తి కాలేదని..స్టడీ మెటీరియల్ తమ దగ్గర లేదని వాపోయారు. నెల రోజులు మాత్రమే తరగతులు జరిగాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ లోనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో రాబోయే పరీక్షలను ఏ విధానంలో నిర్వహించాలో నిర్ణయించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని వర్సిటీ నిర్ణయించింది. ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్ పరీక్షలపై విద్యార్థులతో ప్రతిష్టంభనను తొలగించడానికి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తల కోసం

డాక్టర్ ను సస్పెండ్ చేసిన మంత్రి హరీష్ రావు

వర్షానికి వణికిన ఢిల్లీ .. కూలిన ఇళ్లు, చెట్లు