సెంచరీతో చెలరేగిన కోహ్లీ..కోల్ కతా టార్గెట్-214

సెంచరీతో చెలరేగిన కోహ్లీ..కోల్ కతా టార్గెట్-214

కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో బిగ్  స్కోర్ చేసింది బెంగళూరు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 రన్స్ చేసింది.  కెప్టెన్ విరాట్ కోహ్లీ (100) సెంచరీతో రెచ్చిపోగా..మొయిన్ అలీ (66) హాఫ్ సెంచరీ చేశాడు.  కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సునీల్ నరైన్ వేసిన 4వ ఓవర్ రెండో బాల్ కి  పార్థీవ్ పటేల్ నితీశ్ రానాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొంత సమయానికే అక్షదీప్ నాథ్(13) రస్సెల్ బౌలింగ్‌ లో కీపర్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఈ దశలో కష్టాల్లోపడ్డ జట్టుకు కోహ్లీ, మొయిన్ అలీల జోడీ అండగా నిలిచింది. అలీ కోల్‌ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 28 బాల్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సులులతో 66 రన్స్ చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ వేగం పెంచి 9 ఫోర్లు, 4 సిక్సులతో 100 రన్స్ తో కోల్ కతా ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ను ముందుంచాడు.

కోల్ కతా బౌలర్లలో..రస్సెల్, నరైన్, కుల్దీప్, గుర్నీ తలో వికెట్ తీశారు.