గాంధీనగర్: ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా పతకాల బోణీ చేసింది. సోమవారం జరిగిన విమెన్స్ 48 కేజీల విభాగంలో కోమల్ కోహర్ బ్రాంజ్ మెడల్‌తో మెరిసింది. మొత్తం 177 కేజీల (స్నాచ్‌లో 78, క్లీన్ అండ్ జర్క్‌లో 99) బరువు ఎత్తిన కోమల్ మూడో ప్లేస్‌లో నిలిచింది.
క్లీన్ అండ్ జర్క్‌లో కోమల్ ఆకట్టుకోవడంతో పతకం ఖాయమైంది. చైనీస్‌తైపీకి చెందిన హువాంగ్ యీ చెన్ (193), ఫాంగ్ వాన్‌లింగ్ (192) వరుసగా గోల్డ్, సిల్వర్‌ను సొంతం చేసుకున్నారు.
