అంగన్వాడీలకు రూ. 26 వేలు.. ఆశావర్కర్లు రూ.18 వేల వేతనం ఇవ్వాలి:రాజగోపాల్ రెడ్డి

అంగన్వాడీలకు  రూ. 26 వేలు.. ఆశావర్కర్లు రూ.18 వేల వేతనం ఇవ్వాలి:రాజగోపాల్ రెడ్డి

అంగన్ వాడీలకు  రూ. 26 వేలు, ఆశావర్కర్లు రూ.18 వేల కనీస వేతనం, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు  బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం ముందు సమ్మె  చేసిన అంగన్ వాడీ ,ఆశావర్కర్లకు  రాజగోపాల్  రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడియన ఆయన.. గత 20 రోజులు గా దీక్ష చేస్తున్న అంగన్వాడీ లకు న్యాయం చేయాలన్నారు. కరోనా సమయంలో సేవలందించిన అంగన్ వాడీలను  ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వనిదేన్నారు. 

అంగన్ వాడీల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి ఆంధ్ర కాంట్రాక్టులకు దోచి పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాందించి.. చిన్న చిన్న ఉద్యోగులను  సమ్మె బాట పట్టిస్తుండని ధ్వజమెత్తారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ లు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.