ఇంటర్ ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం:కోమటిరెడ్డి

ఇంటర్ ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం:కోమటిరెడ్డి

నల్గొండ: మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్రప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం లేదనడానికి ఇంటర్ ఫలితాలే ఓ నిదర్శనం అని అన్నారు. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి.. తమ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం సిగ్గుచేటు అనిపిస్తోందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. వెంటనే మంత్రివర్గం నుంచి జగదీశ్ రెడ్డిని డిస్మిస్ చెయ్యాలన్నారు కోమటి రెడ్డి.

రెవెన్యూశాఖను ముఖ్యమంత్రి తన వద్ద ఉంచుకొని.. అదే శాఖలో అవినీతి జరుగుతుంది అని చెప్పడం సిగ్గుచేటని అన్నారు కోమటిరెడ్డి. వెంటనే రెవెన్యూ శాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమీ లేదన్నారు వెంకట్ రెడ్డి.