పాదయాత్రకు నో పర్మిషన్….. కోర్టుకెళ్తానన్న కోమటిరెడ్డి

పాదయాత్రకు నో పర్మిషన్….. కోర్టుకెళ్తానన్న కోమటిరెడ్డి

నల్గొండ : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిర్ణయించిన పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెళ్ళెంల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధన ఉద్దేశంతో… సోమవారం నుంచి పాదయాత్ర చేస్తానని కోమటిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఐతే… ఆయన పాదయాత్రకు ఎటువంటి అనుమతి లేదని.. నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ నోటీసులు జారీచేశారు. పాదయాత్రకు పోలీసు బందోబస్తు ఇవ్వలేమని నోటీసులో స్పష్టం చేశారు ఎస్పీ రంగనాధ్.

పాదయాత్రపై తనకు ఎటువంటి నోటీసులు రాలేదని.. ప్రభుత్వం నిరంకుశ ధోరణితో తన  పాదయాత్ర కార్యక్రమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. పాదయాత్ర చేయడం తన హక్కు అని.. తన స్వేచ్ఛకు అడ్డుపడితే… కోర్టుకు వెళ్తా అన్నారు. హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని అయినా పాదయాత్ర చేసి తీరుతా అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.