V6 News

డీలిమిటేషన్‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం : సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి

డీలిమిటేషన్‌‌‌‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం :  సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి
  •    సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

కరీంనగర్ సిటీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసేలా డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ గెస్ట్‌‌‌‌ హౌస్‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ  చేస్తున్న ఈ అన్యాయాన్ని  రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. 

12 ఏండ్లుగా పార్లమెంటులో ఏ బిల్లు వీగిపోలేదని మహిళా బిల్లు విషయంలో కుట్ర జరిగిందన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజ శేఖర్, పిట్టల రవీందర్, మల్లిఖార్జున రాజేందర్, శ్రీనివాస్, జగన్ రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.